మోస్ట్‌ ఎలిజిబుల్‌!

5 Feb, 2020 03:07 IST|Sakshi
అఖిల్‌

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో అఖిల్‌ ఒకరు. ఇప్పుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా అలాంటి పాత్రనే చేస్తున్నట్లున్నారు. అందుకే ఈ చిత్రానికి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఉంటారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 8న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల కానుంది. ఆమని, మురళీ శర్మ, జయప్రకాష్, ప్రగతి, ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్‌’ శ్రీను, అభయ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది 

మరిన్ని వార్తలు