షాకింగ్‌ : పైరసీలో భాగమతి, రంగస్థలం టాప్‌

5 Jul, 2018 20:39 IST|Sakshi

సినీ పరిశ్రమను పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బయటికొచ్చేస్తుంది. కొన్ని సినిమాలైతే విడుదలకు ముందే పైరసీ భారినపడుతున్నాయి. దీనిపై పరిశ్రమ వర్గాలు ఎన్నిరకాలు చర్యలు చేపట్టిన పైరసీకి అడ్డుకట్ట పడటం లేదు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని కొన్ని ముఠాలు చిత్ర పరిశ్రమను హడలెత్తిస్తున్నాయి. జర్మన్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెక్సిపియో సంస్థ గత ఆరేళ్ల నుంచి పైరసీ వెబ్‌సైట్‌లపై అధ్యయనం చేస్తోంది. ఆ డేటా ఆధారంగా 2018లో ప్రథమార్ధంలో విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధికంగా పైరసీకి గరయిన  టాప్‌-10 సినిమాల జాబితాను ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది.

పైరసీ జాబితాలో అనుష్క నటించిన భాగమతి 19లక్షల డౌన్‌లోడ్లతో అగ్రభాగాన నిలువగా, రామ్‌ చరణ్‌ , సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం 16 లక్షలతో రెండో స్థానంలోనిలిచింది.టెక్సిపియో ప్రతినిధి మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు సంబంధించిన పైరసీ షేరింగ్‌ భారత్‌లోనే కాకుండా యూఎస్‌, శ్రీలంక, సౌదీ అరేబియా, యూఏఈ, పశ్చిమాసియా దేశాల్లో అధికంగా ఉన్నట్టు తమ పరిశీలనలో బయటపడిందన్నారు. అదే విధంగా భారత్‌లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, ముంబై నగరాల్లో పైరసీ ఎక్కువగా చూస్తున్నారని తెలిపారు.

పైరసీ టాప్‌-10లో నిలిచిన ఇతర సినిమాలు 
3. భరత్‌ అనే నేను
4. మహానటి
5. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
6. తొలిప్రేమ
7. ఛలో
8. అజ్ఞాతవాసి
9. జై సింహా
10. టచ్‌ చేసి చూడు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా