డబుల్‌ ధమాకా

8 Apr, 2020 02:18 IST|Sakshi

రవితేజ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో రవితేజ తన అభిమానులకు డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారట. ఎన్‌ఆర్‌ఐ బిజినెస్‌మేన్‌గా, చార్టెడ్‌ అకౌంటెంట్‌గా రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్‌. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. అలాగే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన రైటర్‌ వక్కంతం వంశీ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా