అన్నీ మనీ సంబంధాలే

9 Dec, 2013 00:47 IST|Sakshi
అన్నీ మనీ సంబంధాలే
 ‘నచ్చావులే’ ఫేం నవీన్, అలేఖ్య జంటగా రూపొందిన చిత్రం  ‘మిస్టర్ మనీ’. కంది రామచంద్రారెడ్డి దర్శకుడు. మందాడి రవీందర్‌రెడ్డి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘మానవ సంబంధాలు, మనీ సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఆద్యంతం హాస్యభరితంగా సాగే సినిమా ఇది’’ అని చెప్పారు. అనుకున్నదానికంటే గొప్పగా దర్శకుడు ఈ సినిమాను మలిచాడని, సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుందని నిర్మాత చెప్పారు. కొండవలస, సుమన్‌శెట్టి, తాగుబోతు రమేష్, కోట శంకర్రావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రైసాబ్, సంగీతం: శ్రీవెంకట్.