వెబ్‌ లక్ష్మీ

8 Mar, 2019 03:26 IST|Sakshi
కబీర్, వంశీకృష్ణ, లక్ష్మీ మంచు, ప్రసాద్, బలభద్రపాత్రుని రమణి, ‘చిత్రం’ శ్రీను, భాస్కర్‌

‘‘మిసెస్‌. సుబ్బలక్ష్మి’ కథను రమణీగారు నా దగ్గరకు తీసుకొచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. సినిమాగా చేద్దాం అనుకున్నాం. కానీ వెబ్‌ సిరీస్‌గా తీసుకొస్తున్నాం. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.  ఈ íసిరీస్‌కి స్త్రీలు, పురుషులు అందరూ సమానంగా కనెక్ట్‌ అవుతారు’’ అని లక్ష్మీ మంచు అన్నారు. లక్ష్మీ మంచు, అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వంశీ కృష్ణ రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘మిసెస్‌. సుబ్బలక్ష్మి’. రచయిత్రి బలభద్రపాత్రుని రమణి కథను అందించారు.

‘రావల్సినంత ప్రేమ, గుర్తింపు రావడంలేదని, తన లోటు భర్తకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చిన భార్య ప్రయాణంతో సాగే కథే ‘మిసెస్‌. సుబ్బలక్ష్మి’. ఉమెన్స్‌ డే సందర్భంగా పది ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్‌ సిరీస్‌ ‘జీ5’ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో లక్ష్మీ మంచు మాట్లాడుతూ – ‘‘ సినిమా తీయడానికి సుమారు 150 మంది చాలా కష్టపడతాం.  అది పూర్తయి థియేటర్‌కు వెళ్లేటప్పుడు భయమేస్తుంది. ఆ సినిమాను ఆడనిస్తారా? కొత్త సినిమా వస్తుందని తీసేస్తారా? తెలియదు.

ఎందుకంటే సినిమా థియేటర్లు కొంతమంది ఆధీనంలోనే ఉంటున్నాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఆడియన్స్‌కు కావల్సిన వినోదాన్ని అందించవచ్చు. ఎలాంటి ప్రయోగం అయినా చేయొచ్చు. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంట్లోనే ఇస్తున్నాం. వంశీ కృష్ణ మంచి సహకారం అందించాడు. వెబ్‌ సిరీస్‌లలో ఇది ఒక బెంచ్‌మార్క్‌ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘మంచు లక్ష్మిగారు చాలా రోజులుగా ఈ వెబ్‌ సిరీస్‌తో ట్రావెల్‌ అవుతున్నారు. ఈ సిరీస్‌ని అందరూ ఎంజాయ్‌ చేస్తారనుకుంటున్నాం’’ అన్నారు వంశీకృష్ణ. ‘‘అనుకున్న పాయింట్‌ను సరదాగా చెప్పాం. సీక్వెల్‌ ప్లాన్‌ కూడా ఉంది’’ అన్నారు బలభద్రపాత్రుని రమణి.

మరిన్ని వార్తలు