'ఎమ్ ఎస్ ధోని' సెంచరీ

9 Oct, 2016 15:50 IST|Sakshi
'ఎమ్ ఎస్ ధోని' సెంచరీ

భారత క్రికెట్ వీరుడు ఎమ్ ఎస్ ధోని వెండితెర మీద కూడా సెంచరీ కొట్టేశాడు. ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎమ్ ఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరి వంద కోట్ల కలెక్షన్ మార్క్ను అందుకుంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధోని ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లతో సత్తా చాటుతోంది. ఇప్పటికే 103 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ధోని ముందు ముందు మరిన్ని రికార్డ్లను సాధించే దిశగా సాగుతోంది.

ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకుడు. అనుపమ్ ఖేర్, భూమిక, కైరా అద్వానీ, దిశాపఠానీలు ఇతర ప్రధాన పాత్రల్లోనటించిన ధోని సినిమాను అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.