బోల్డ్‌ హరి

5 Jan, 2020 01:59 IST|Sakshi
రుహానీ శర్మ, శ్రవణ్‌ రెడ్డి

శ్రవణ్‌ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్‌ కౌర్‌ నాయకా నాయికలుగా నటించిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్‌ బాబు, గూడూరు సాయిపునీత్‌ నిర్మిస్తున్నారు. ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్‌. రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఎం.ఎస్‌. రాజు మాట్లాడుతూ– ‘‘బాలచందర్, పుట్టన్న కనగల్, భరతన్‌ వంటి దర్శకులు బోల్డ్‌ మూవీస్‌ తీశారు. అవి బోల్డ్‌గా ఉన్నా బ్యూటిఫుల్‌గా, క్లాసికల్‌గా ఉండేవి.

అలాంటి దర్శకుల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నేను బోల్డ్‌గాను, పొయెటిక్‌గానూ తీశాను. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథాంశాన్ని గోప్యంగా ఉంచుతున్నాం. షూటింగ్‌ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉన్నాం. త్వరలోనే టీజర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘డర్టీ హరి’  బోల్డ్‌గా ఉంటుంది. అలాగని ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్‌ కాలేదు’’ అన్నారు నిర్మాతలు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

సినిమా

ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌