శ్రీరెడ్డి అలా చేయడం తప్పు: మురళీ మోహన్‌

19 Apr, 2018 13:47 IST|Sakshi
రాజమండ్రి ఎంపీ, సీనియర్‌ నటుడు మురళీమోహన్

క్రమశిక్షణ లేనివారికి ‘మా’ సభ్యత్వం ఇవ్వరు

రాజమండ్రి : తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న శ్రీరెడ్డి అంశంపై రాజమండ్రి ఎంపీ, సీనియర్‌ నటుడు మురళీమోహన్ స్పందించారు. ‘ఒక భారతీయ మహిళ అయివుండి అర్థనగ్న ప్రదర్శన చేయటం తప్పు. క్రమశిక్షణతో లేనివారికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే శ్రీరెడ్డికి ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వను’ అన్నారు. తెలుగు సినీరంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందటూ, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి వివాదం తరువాత రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ ను వివాదంలోకి లాగటంపై మెగా ఫ్యామిలీ, ఇండస్ట్రీ వర్గాలు సీరియస్‌ అయ్యాయి. నటుడు శివ బాలాజీ పవన్‌ ను దూషించినందుకు శ్రీరెడ్డిపై  రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

సినిమా

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై