పద్మవిభూషణ్‌పై స్పందించిన మ్యూజిక్‌ మ్యాస్ట్రో

25 Jan, 2018 23:22 IST|Sakshi

సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018కి చెందిన పద్మ అవార్డులను గురువారం ప్రకటించింది. అనేక రంగాల్లో సేవలందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2018 ఏడాదికి 85 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మశ్రీ 73 మందికి, పద్మభూషణ్‌ 9మందికి, ముగ్గురికి పద్మవిభూషణ్‌ అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల ప్రధానోత్సవం రిపబ్లిక్‌ డే నాడు జరుగుతాయి. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం 2018 సంవత్సరంలో మొత్తం 15,700 మంది ప్రముఖులు దరఖాస్తు చేసుకన్న విషయం తెలిసిందే.  

మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం సంగీతం, కళలు విభాగంలో పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించింది. తనకు పద్మవిభూషణ్‌ అవార్డు రావడం పై మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా స్పందించారు. పద్మవిభూషణ్‌ రావడం చాలా ఆనందంగా ఉందని ఇళయరాజా అన్నారు.  ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక నాకు వచ్చిన ఈ అవార్డును దక్షిణాది చిత్రసీమకు అంకితమని ఇళయరాజా అన్నారు.

పద్మ అవార్డుల జబితాలో రాష్ట్రాల వాటా
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులో అధికంగా మహారాష్ట్ర(11అవార్డులు) వారికి దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం ఒక పద్మ అవార్డు మాత్రమే వరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్‌కు క్రీడల విభాగం(బ్యాడ్మింటన్‌)లో పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మహారాష్ట్ర         - 11
కర్ణాటక              - 9 
తమిళనాడు        - 6
పశ్చిమ బెంగాల్‌   -  5
 కేరల                -  4
మధ్యప్రదేశ్‌         - 4 
ఒడిషా              -  4
గుజరాత్‌             - 3
ఆంధ్రప్రదేశ్‌           -1
తెలంగాణ             -0

మరిన్ని వార్తలు