నయన్‌తో కోలీవుడ్‌కు.. తాప్సీతో బాలీవుడ్‌కు

6 Jun, 2019 12:42 IST|Sakshi

సంగీత రంగంలో ఉరకలేస్తున్నాడు యువ సంగీత దర్శకుడు రోన్‌ ఈత్తన్‌ యోహాన్‌. ఈయన తండ్రి రాజన్‌ ప్రముఖ గిటారీస్ట్, తాత జావీద్‌ సంగీత కళాకారుడే. తండ్రి ప్రోత్సాహంతో స్వయంకృషితోనే సంగీత దర్శకుడిగా ఎదిగాడు. లండన్‌లో వెస్ట్రన్‌ క్లాసికల్‌ సంగీతాన్ని నేర్చుకున్నాడు. అంతే సంగీతదర్శకుడిగా అవకాశం వరించేసింది. అగ్రనటి నయనతార సెంట్రిక్‌ కథా పాత్ర లో నటించిన మాయ చిత్రానికి సంగీతాన్ని అందిం చే అవకాశం. ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అంతే ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో అవకాశాలు వరుస కడుతున్నాయి. తమిళంలో మాయ వంటి సంచలన విజయం సాధిం చిన చిత్రం తరువాత అరవిందస్వామి, శ్రియ నటించిన నరకాసురన్, సిగై, ఇరవా కాలం వంటి చిత్రాలకు సంగీతం అందించారు.

ఇక మలయాళంలో సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఒప్పం చిత్రానికి నేపధ్య సంగీతం అందించారు. కన్నడంలో శివరాజ్‌కుమార్‌ హీరోగా న టించిన కేశవా చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేశారు. తాజాగా టాలీవుడ్‌ను టచ్‌ చేశారు. అక్కడ మదనం అనే అందమైన ప్రేమ కథా చిత్రంలో పరిచయం అవుతున్నారు. నయనతార మాయ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన యోహాన్‌ ఇప్పుడు తాప్సీ నటించిన గేమ్‌ఓవర్‌ చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొంది త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని రోన్‌ ఈత్తన్‌ యోహాన్‌ సాక్షితో పంచుకున్నారు. తన కు గురువు ఇళయరాజా, స్ఫూర్తినిచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్‌. రెహ్మాన్, ఇష్టమైన సంగీత దర్శకుడు ఆర్‌డీ. బర్మన్‌ అనీ చెప్పారు. హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్న తనకు మెలోడీ పాటలంటేనే ఇష్టం అని తెలిపారు. తెలుగులో నాగార్జున, ప్రభాస్, విజయ్‌దేవరకొండ తనకు నచ్చిన హీరోలని చెప్పారు. తమిళంలో విజ య్, అజిత్‌ అంటే ఇష్టం అని, దర్శకుడు మ ణిరత్నం, సెల్వరాఘవన్‌ వంటి దర్శకుల చిత్రాలకు పని చేయాలని ఆశిస్తున్నానని చెప్పాడు. సంగీతంతో పాటు కథలు రాయడంలో ఆసక్తి ఉందని, భవిష్యత్‌లో దర్శకత్వం చేపట్టాలన్న కోరిక ఉందని రోన్‌ ఈత్తన్‌ యోహాన్‌ వెల్లడించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా