ఇక ఆ బాధ అక్కర్లేదు

1 Oct, 2018 02:53 IST|Sakshi
త్రిష

‘‘రజనీకాంత్‌గారితో కలిసి నేనెప్పుడు పని చేస్తాననే ప్రశ్న నన్ను ఎంతకాలం నుంచో బాధపెడుతోంది. ఇక బాధపడక్కర్లేదు. ‘పేట్టా’ సినిమాలో ఆయనతో కలిసి సిల్వర్‌ స్క్రీన్‌ పంచుకునే అవకాశం నాకు దక్కింది. సోమవారం నుంచి వారణాసిలో జరిగే తాజా షెడ్యూల్‌ చిత్రీకరణలో పాల్గొంటాను’’ అన్నారు త్రిష. ఎందుకు ఇంతలా ఆమె భావోద్వేగానికి గురయ్యారంటే... త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటివరకు రజనీకాంత్‌తో త్రిష కలిసి నటించలేదు.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ అవకాశం వచ్చినందుకు ఆనందపడుతున్నారామె. అన్నట్లు.. ఈ   చిత్రంలో సిమ్రాన్‌ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అసలు సిమ్రాన్, త్రిష కాంబినేషన్‌ సన్నివేశాలు లేవట. దీన్నిబట్టి ఈ చిత్రం ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఓ కథానాయిక ఉంటారని ఊహించవచ్చు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  విజయ్‌ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధికీ, బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహనన్‌ కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు