నాకు విలువైన బర్త్‌డే విషెస్ ఇవే: ఎన్టీఆర్

20 May, 2017 10:05 IST|Sakshi

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా జరుపుకున్నారు. నిన్న రాత్రి తన భార్య, కుమారుడు అభయ్ రామ్‌లు బర్త్‌డే విషెస్ చెప్పారని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తనకు తొలి, అతి విలువైన పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవేనంటూ కుమారుడు అభయ్ రామ్‌ తనకు విషెస్ చెప్పినప్పుడు  దిగిన ఫొటోను తన ఫాలోయర్స్‌తో షేర్ చేసుకున్నారు. 'నాన్నకు ప్రేమతో' లాంటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత తండ్రిగా తన బాధ్యతలు మరింత పెరిగాయని ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.

'ఫ్యామిలీ టైమ్.. అభయ్ నా కళ్లు ఎందుకు మూశాడో తెలియదంటూ' భార్య ప్రణతి, అభయ్ లతో ఉన్న ఫొటోను మరో ట్వీట్లో పోస్ట్ చేశారు. ఫొన్‌లో ఏదో చూపించి తనకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు వాళ్లు ఎంతో ఉత్సాహంగా తన వద్దకు వచ్చారని ఎన్టీఆర్ తెలిపారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ #HappyBirthdayNTR ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ ట్వీట్లు కూడా విపరీతంగా షేర్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ప్రస్తుతం జై లవకుశ మూవీలో నటిస్తున్నారు.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి