అడల్ట్‌ నటి ఇమేజ్‌తో పాట్లు..!

30 Oct, 2017 19:03 IST|Sakshi

జీవీ ప్రకాశ్‌ హీరోగా నటించిన డార్లింగ్‌ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార నిక్కీగల్రాని. తొలి చిత్రంలోనే దెయ్యం పాత్రలో నటించి అందరినీ భయపెట్టింది. దీంతో ఈ అమ్మడికి తమిళంలో అవకాశాలు వెల్లువెత్తాయి. కెరీర్‌లో జయాపజయాలను చవిచూసిన నిక్కీగల్రాని ’హరహర మహాదేవకి’ చిత్రంలో బోల్డ్‌గా నటించి అడల్ట్‌ నటిగా మారింది. దీంతో పలువురు దర్శక నిర్మాతలు ఆమెకు ఇదే తరహా ఆఫర్లతో ముంచెత్తారు. వాటికి నో చెప్పిన నిక్కీ అడల్ట్‌ నటి ఇమేజ్‌ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది.

అందులోభాగంగానే ’ఇరుట్టి అరయిల్‌ మురట్టు కుత్తు’ (చీకటి గదిలో మొరటి పోట్లు) చిత్రంలో మళ్లీ గౌతమ్‌ కార్తీక్‌ సరసన నటించడానికి ఆమె నిరాకరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సుందర్ సీ రూపొందిస్తున్న ’కలగలప్పు-2’ చిత్రంలో నటిస్తోంది.  జనవరిలో ఈ సినిమా విడుదలవుతుందని నిక్కీ తెలిపింది. హరహర మహాదేవ కామెడీ చిత్రం అయినప్పటికీ అది అడల్ట్‌ ఓన్లీ చిత్రమని, కలగలప్పు-2 కూడా కామెడీ చిత్రమే అయినా ఇది అడల్ట్‌ చిత్రం కాదని,  ఈ చిత్రంతో తనపై ఉన్న అడల్ట్‌ చిత్రాల నాయిక ఇమేజ్‌ పోతుందనే నమ్మకంతో ఉన్నట్టు నిక్కీ తెలిపింది.

మరిన్ని వార్తలు