'స్మితాపాటిల్ అద్భుతమైన వ్యక్తి'

18 Oct, 2013 15:27 IST|Sakshi
'స్మితాపాటిల్ అద్భుతమైన వ్యక్తి'
'ఆమె ఎవరో నాకు తెలియదు. ఎలా ఉంటుందో కూడా ఊహించలేను. ఆమె గురించి ఇతరులు అందించిన సమాచారం ద్వారానే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి. గొప్ప విశాల హృదయం ఉన్న వ్యక్తి అని కూడా తెలుసుకున్నాను' అని ఓ తనయుడు గుండెల్లోంచి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఇటీవల బాలీవుడ్ తెరకు పరిచయమైన రాజ్ బబ్బర్ కుమారుడు ప్రతీక్ బబ్బర్. ఇక ప్రతీక్ బబ్బర్ మాట్లాడింది... ఎంతోమంది అభిమానులను చూరగొన్న స్మితాపాటిల్ గురించి అని అర్ధమై ఉంటుంది. 
 
అమ్మను నేను ఎంతగా ఇష్టపడతాననే విషయం ఇక్కడకు రావడం వల్లనే అర్థమవుతోంది. గతంలో ఇక్కడికి వచ్చి ఎంతో మంది పిల్లల్ని ఇక్కడ కలుసుకునేదని తెలిసింది. నేను కూడా ఓ మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాను అని ప్రతీక్ బబ్బర్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల తాను, ఇతరులు కూడా సంతోష పడతారన్నారు. జీవితంలో స్పూర్తి పొందాలనుకునే ప్రతిసారీ తాను స్మితాపాటిల్, రాజ్ బబ్బర్ లనే అనుసరిస్తానని ప్రతీక్ తెలిపారు. 
 
స్మితాపాటిల్, రాజ్ బబ్బర్ కుమారుడినని చెప్పుకొవడం తనకు గొప్పగా ఉంటుందని, తన జీవితానికి తల్లితండ్రులే సూర్తి అని అన్నారు. తన తల్లి తండ్రులకు మరింత పేరు తెచ్చేలా నటిస్తానని ప్రతీక్ తెలిపారు. దోభీ ఘాట్, అరక్షన్, మై ఫ్రెండ్ పింటూ చిత్రాల్లో ప్రతీక్ బబ్బర్ నటించాడు. 
 
భారత చిత్ర పరిశ్రమ అందించిన కళాకారుల్లో బాలీవుడ్ నటి స్మితాపాటిల్ ఓ అరుదైన ఆణిముత్యం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం స్మితాపాటిల్ 58వ జన్మదిన కార్యక్రమాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ ఘనంగా నిర్వహించింది.  'భూమిక', 'అర్థ్'  లాంటి చిత్రాలతో అభిమానుల హృదయాలను దోచుకున్న స్మితాపాటిల్ తన 31 ఏట ప్రసూతి సమయంలో తలెత్తిన సమస్యతో 1986 లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

నటి విజయశాంతికి హైకోర్టు నోటీసులు

భరత్ఃఅసెంబ్లీ

'తొలిప్రేమ' కోసం సిక్స్‌ ప్యాక్‌..!

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి