అమ్మ నా మాటలు నమ్మలేదు: నటి

24 Nov, 2016 22:43 IST|Sakshi
అమ్మ నా మాటలు నమ్మలేదు: నటి

న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న మూవీ ‘రాయిస్’. ఈ మూవీలో బాలీవుడ్ బాద్‌షా హీరో కాగా, పాకిస్తాన్ నటి మహీరాఖాన్ ఈ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఉడీలో పాక్ ఉగ్రదాడుల తర్వాత దాయాది దేశానికి చెందిన ఆర్టిస్టులపై నిషేధం, వారు నటించిన మూవీలను విడుదలను అడ్డుకోవాలంటూ 'రాయిస్', 'ఏ దిల్ హై ముష్కిల్' లపై ఇటీవల పెనుదుమారం చెలరేగింది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మహీరా కొన్ని విషయాలను తెలిపింది. తన తల్లికి బాలీవుడ్ ఎంట్రీ విషయం చెప్పగా ఆమె పెద్దగా షాక్ కాలేదని, అయితే స్టార్ హీరో షారుక్ సరసన నటిస్తున్నానని చెబితే నమ్మలేదని చెప్పింది. 'నువ్వు అబద్దం చెబుతున్నావు, ఎందుకంటే షారుక్ లాంటి అగ్రహీరో మూవీతో ఎంట్రీ ఛాన్స్ దక్కడం ఎవరికైనా కష్టమే' అన్న మా అమ్మ ఈ విషయాన్ని నమ్మిన వెంటనే ఉద్వేగానికి లోనై ఒక్కసారిగా ఏడ్చేసిందని నటి మహీరా చెప్పుకొచ్చింది. మోహసినా అనే పాత్రలో తాను రాయిస్ లో కనిపించనుంది. వచ్చే ఏడాది జనవరి 26న మూవీని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది.