మా ఆవిడ పాజిటివ్‌గా మాట్లాడదు

22 May, 2015 08:35 IST|Sakshi
మా ఆవిడ పాజిటివ్‌గా మాట్లాడదు

తన  భార్య ఏ విషయంలోనూ పాజిటివ్‌గా మాట్లాడదని యువ గాయకుడు, తాజాగా కథానాకుడిగా అవతారమెత్తిన క్రిష్ అన్నారు. ఆయన నటి సంగీతను ప్రేమ వివాహం చేసుకున్న  విషయం తెలిసిందే. 'నేను ఆశించిందేదీ ఆ దేవుడు ఇవ్వలేదు. అయితే అవసరం అయినవన్నీ అందించాడు సంగీతతో సహా. ఎవరయినా ఎదగాలంటే వెనుక నుంచి పుషింగ్ కావాలి. ఆ విధంగా ప్రోత్సహించి నేనీ స్థాయికి చేరడానికి కారకులైన వారిలో తొలి వ్యక్తి సంగీత దర్శకుడు హారీష్‌ జయరాజ్, అలగే యువన్ శంకర్ రాజా కూడా. నటుడవ్వాలన్నది నా చిరకాల కోరిక. నేను సినిమా గురించి అమెరికాలో రెండేళ్లు యాక్టింగ్ కోర్స్ చేశాను.
 
 అలాంటి అనూహ్య పరిస్థితిలో గాయకుడినయ్యాను. నన్ను గాయకుడిగా ప్రోత్సహించిన వారిలో సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని ఒకరు. నేను కృతజ్ఞతలు చెప్పుకోవలసిన వారిలో నిర్మాత ఇబ్రహీమ్ రావుత్తర్ ఒకరు. 'పురియాద ఆనందం పుదిదాగ ఆరంభం' చిత్రం ద్వారా నన్ను కథానాయకుడి పరిచయ చేసిన ఘనత ఆయనదే. నవ దర్శకుడు తంబి సెయ్యదు ఇబ్రహీమ్ ఈచిత్రాన్ని చక్కగా  తెరకెక్కించారు. నాయకి శిష్టి డాంగే అంకిత భావంతో నటించారు. పురియాద ఆనందం పుదిదాగ ఆరంభం  చిత్రం జనరంజకంగా వచ్చింది.

నా భార్య ఏ విషయం గురించి పాజిటివ్‌గా మాట్లాడదు. అలాంటిది ఈ చిత్రం చూసి తప్పించుకున్నవ్ చిత్రం బాగుంది అని కితాబు ఇచ్చింది' అని అన్నారు. పురియాద ఆనందం పుదిదాగా ఆరంభం చిత్రం ద్వారా గాయకుడు క్రిష్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. గతంలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రావుత్తర్ ఫిలింస్ అధినేత ఇబ్రహీమ్ రావుత్తర్ సుమారు ఏడేళ్ల విరామం తరువాత నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సోదరి రైహనా శేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు గురువారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత వెల్లడించారు.