త్రినేత్ర... ఓ సీక్రెట్‌ ఏజెంట్‌

20 Jul, 2018 00:48 IST|Sakshi
సుప్రియ

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో టాలీవుడ్‌కి హీరో, హీరోయిన్లుగా పరిచయమయ్యారు పవన్‌ కల్యాణ్, సుప్రియ. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సుప్రియ తర్వాత నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టి, సినిమా నిర్మాణం చూసుకుంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సుప్రియ మళ్లీ నటనవైపు అడుగులేసి ‘గూఢచారి’ సినిమాతో రీ–ఎంట్రీ ఇస్తున్నారు. అడివి శేష్, మిస్‌ ఇండియా శోభిత ధూళిపాళ్ల జంటగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అభిషేక్‌ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రంలో సుప్రియ కీలక పాత్ర చేశారు.

ఈ చిత్రంలో ఆమె పోషించిన నదియా ఖురేషి పాత్ర లుక్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘త్రినేత్ర అనే సీక్రెట్‌ ఏజెన్సీకి వర్క్‌ చేసే మిస్టీరియస్‌ ఏజెంట్‌గా ఆమె కనిపిస్తారు. రా ఏజెన్సీలో డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ చీఫ్‌ టాస్క్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ 92 ఎఫ్‌ఎస్‌ తుపాకీని క్యారీ చేస్తుంటారు. సుప్రియ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు.. సినిమాకి కీలకం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్‌ 3న సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షానిల్‌ డియో, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిట్టు సూర్యన్, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు