ఒక్క రోజులో..!

15 Dec, 2015 23:27 IST|Sakshi
ఒక్క రోజులో..!

అప్పటివరకూ ఆడుతూ పాడుతూ హాయిగా సాగిన ఆ కుర్రాడి జీవితం ఒక్క రోజులో ఘాట్‌రోడ్టులా మలుపులు తిరిగింది. ఆ రోజు ఏం జరిగింది? ఆ మలుపులు అతని ప్రయాణాన్ని ఎంత దాకా తీసుకెళ్లాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘భలే మంచి రోజు’. సుధీర్‌బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన  ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ‘‘ఈ సినిమాలో కొత్త సుధీర్‌ను చూస్తారు’’ అని దర్శకుడు అన్నారు. ‘‘డిఫరెంట్ జానర్‌లో సాగే కామెడీ కథాంశంతో తెరకెక్కించాం’’ అని సుధీర్‌బాబు అన్నారు. ‘ఉత్తమ విలన్’ కెమెరామన్ శ్యామ్‌దత్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి