క్లాసిక్ టైటిల్.. ఎవరి కోసమో..!

10 Oct, 2017 12:34 IST|Sakshi

తాజాగా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయిన ఓ టైటిల్ ఆసక్తికరంగా మారింది. భారీ చిత్రాలను నిర్మిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అమర్ అక్బర్ ఆంటోని అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్లాసిక్ మూవీ టైటిల్ ను ఇప్పుడు తెలుగులో ఎవరితో తెరకెక్కిస్తారో అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

టైటిల్ ను బట్టి ఇది మల్టీ స్టారర్ సినిమా అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇప్పటికే కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటితో పాటు పవన్ కళ్యాణ్, సంతోష్ శ్రీనివాస్ లతో పాటు శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా, అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా చర్చల దశలో ఉన్నాయి.  అయితే రవితేజ సినిమాకే అమర్ అక్బర్ ఆంటోని అనే క్లాసిక్ టైటిల్ నిర్ణయించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు