ఊటీలో సూర్య!

24 Sep, 2017 11:14 IST|Sakshi

హైదరాబాద్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌ను కుమ్మేసిన సూర్య కూల్‌గా ఊటీ చేరుకున్నాడు. చల్లదనానికి చిరునామా ఊటీ. మరి.. ఆ చల్లచల్లని ప్రాంతంలో హీరోయిన్‌తో డ్యూయెట్‌ పాడతారో లేక అక్కడ కూడా విలన్లను రఫ్ఫాడేస్తారో కానీ, సూర్య ఊటీలో ల్యాండ్‌ అయిపోయాడు. సూర్య ఎవరో ఊహించే ఉంటారు.

యస్‌... అల్లు అర్జున్‌. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఏప్రిల్‌ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత తెలిపారు.

మరిన్ని వార్తలు