నడిగర్ సంఘం సమావేశం తథ్యం

27 Nov, 2016 02:54 IST|Sakshi
నడిగర్ సంఘం సమావేశం తథ్యం

మారిన వేదిక
తమిళసినిమా: వ్యతిరేకవర్గం ఆరోపణ లు, కేసులు, కోర్టులు లాంటి పలు వివాదాల మధ్య ఎట్టకేలకు దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్‌సంఘం) సర్వసభ్య సమావేశం ముందుగా నిర్ణరుుంచిన ప్రకారమే ఆదివారం జరగనుంది. అరుుతే వేదికే మారింది. ముం దుగా ఈ సర్వసభ్య సమావేశం స్థానిక నుంగంబాక్కంలోని లయోలా కళాశాల లో జరపనున్నట్లు కార్యవర్గం వెల్లడిం చింది. అరుుతే అక్కడ నిర్వహించడానికి పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. భ ద్రతా దష్ట్యా పోలీసులు కూడా లయో లా కళాశాలలో సమావేశానికి అనుమతించకపోవడంతో స్థానిక టీ.నగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంఘ కార్యదర్శి విశాల్ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఎంజీఆర్ శతజయంతి వేడుక: ఈ సర్వసభ్య ఈ సర్వసభ్య సమావేశంలో తమిళసినిమా నూరేళ్ల వేడుక, ఎంజీఆర్ శత జయంతి వేడుకలతో పాటు వందేళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ కళాకారుల పేర్లతో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరుగుతుందని సంఘ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా సంఘ   కార్యక్రమాల తీర్మానాలు, ఆదాయ, వ్యయాల సభ్యుల ఆమోదం వంటి కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు.

 పోస్టర్లు వద్దు
ఇకపోతే పోలీసు శాఖ అనుమతి లేనందువల్ల సంఘ సర్వసభ్యసమావేశానికి సంబంధంచిన ఎలాంటి పోస్టర్లను గోడలపై అంటించడం లాంటి ప్రచారాలు చేయరాదని సభ్యలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గుర్తింపు కార్డులున్న సభ్యులకే సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఉంటుందని తెలియజేశారు.ఆదివారం జరగనున్న ఈ సమావేశానికి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.