లింగా నష్టాలకు రజనీ బాధ్యత లేదు

9 Jan, 2015 19:12 IST|Sakshi
లింగా నష్టాలకు రజనీ బాధ్యత లేదు

లింగా సినిమా కొనుగోలు వల్ల వచ్చిన నష్టాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ను బాధ్యుడిని చేయడం తగదని నడిగర సంఘం చెప్పింది. సినిమా నష్టాల విషయంలో నిర్మాతను అడగాల్సింది పోయి హీరోను అడగడం సరికాదని సంఘ నాయకులు అన్నారు. కేవలం సూపర్ స్టార్ దృష్టిని ఆకర్షించాలనే డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్షలకు దిగుతున్నారని ఆరోపించారు.

ఏ సినిమా విజయమైనా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని, ఇతర వ్యాపారాల్లో లాగే.. దీంట్లోకూడా లాభాలు, నష్టాలు ఉంటాయని చెప్పారు. లింగా సినిమా చాలా బాగా ఆడుతుందనే అందరూ అనుకున్నారని, కానీ నష్టాలు వచ్చాయని హీరోను తప్పుబట్టడం సరికాదని నడిగర సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. నష్టపరిహారం కావాలంటే వెళ్లి నిర్మాతను అడగాలని, తదుపరి ప్రాజెక్టులో ఏవైనా సర్దుబాట్లు చేసుకోవాలని, అంతేతప్ప హీరోను తప్పుపడితే ఏమొస్తుందని అన్నారు. తాము పెట్టిన డబ్బులో దాదాపు 70 శాతం వరకు నష్టపోయినట్లు డిస్ట్రిబ్యూటర్లు అంటున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి