ఆ పాత్రలో సమంత కాదట..!

15 Sep, 2015 13:41 IST|Sakshi
ఆ పాత్రలో సమంత కాదట..!

'సన్నాఫ్ సత్యమూర్తి' కమర్షియల్గా మంచి మైలేజ్ ఇచ్చినా టాక్ పరంగా మాత్రం త్రివిక్రమ్ను నిరాశపరిచింది. అందుకే తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు మాటల మాంత్రికుడు. స్టార్ హీరోల కోసం ఎదురుచూసి విసిగిపోయిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఫైనల్గా నితిన్ హీరోగా సినిమా ఎనౌన్స్ చేశాడు. అంతేకాదు సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లక ముందే 'అ ఆ' అనే టైటిల్ ఎనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

'అ ఆ' సినిమా విషయంలో మరో ట్విస్ట్ ఇచ్చాడు త్రివిక్రమ్. టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడే ట్యాగ్లైన్ గా 'అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి'ని కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఆనంద్ విహారిగా నితిన్ అని ఫిక్స్ అయిన ఆడియన్స్ అనసూయ రామలింగం అంటే హీరోయిన్ సమంత అయి ఉంటుందని భావించారు. కానీ అనసూయ రామలింగం పాత్రలో నదియ కనిపిస్తుందంటూ షాక్ ఇచ్చాడు త్రివిక్రమ్.

ఈ సినిమాను కూడా అత్త సెంటిమెంట్తో ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ ఈ సారి కామెడీ యాంగిల్ మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడట. త్రివిక్రమ్ డైరెక్షన్లో రెండోసారి అత్తగా నటిస్తున్న నదియా ఈ సారి ఎలాంటి వెరియేషన్ చూపిస్తుందో చూడాలి.