మహానటి తీసినందుకు గర్వంగా ఉంది

26 May, 2018 01:48 IST|Sakshi
నాగ్‌ అశ్విన్, కీర్తీ సురేశ్, విజయ్‌ దేవరకొండ, ప్రియాంకదత్, స్వప్నదత్‌

నాగ్‌ అశ్విన్‌

‘‘మహానటి’ సినిమాను జనాలు వచ్చి చూస్తారని ఆశించాం. నేను ఏదైతే అనుకున్నానో ఆడియన్స్‌ అదే ఫీల్‌ అవుతున్నారు. డైరెక్టర్‌గా నాకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. వెనక ఉండి మా సినిమాను నడిపించిన అందరికీ థ్యాంక్స్‌’’ అని నాగ్‌ అశ్విన్‌ అన్నారు. కీర్తీ సురేశ్‌ లీడ్‌ రోల్‌లో నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో స్వప్న దత్, ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియాతో మాట్లాడారు. స్వప్న దత్‌ మాట్లాడుతూ– ‘‘మహానటి’ సినిమా మూడో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

ప్రేక్షకుల ప్రేమ చూస్తే ఇంకా మంచి సినిమాలు తీయాలనే ఆలోచన వస్తోంది. రాజేంద్రప్రసాద్, నాగచైతన్య.. ఇలా ప్రతి ఒక్కరూ మా సినిమా చేసినందుకు ధన్యవాదాలు’’ అన్నారు.‘‘మహానటి’ సినిమా మా బాధ్యత పెంచింది. సినిమాని హిట్‌ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు ప్రియాంక దత్‌.‘‘సావిత్రిగారి లైఫ్‌ చూసి నేను షాక్‌ అయ్యాను. ‘మహానటి’ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి’’ అన్నారు నటుడు విజయ్‌ దేవరకొండ. ‘‘నాగి, స్వప్న, ప్రియాంక నాకు అందించిన సహకారం మరువలేనిది. నటీనటులు, టెక్నీషియన్స్‌ కష్టం వల్లే సినిమా విజయం సాధించింది. ఈ సక్సెస్‌ నేను మర్చిపోలేను’’ అన్నారు కీర్తీ సురేశ్‌. రచయిత బుర్రా సాయిమాధవ్‌ పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా