ఆలోచింపజేసే పాయింట్‌తో

2 Mar, 2020 05:43 IST|Sakshi
శైలేష్‌ సన్నీ, జ్ఞానేశ్వరి

‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది నేను నమ్మను. మంచి సినిమానా? కాదా? అనేది నమ్ముతాను. ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’ ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌. శైలేష్‌ సన్నీ, జ్ఞానేశ్వరి జంటగా అశోక్‌ రెడ్డి దర్శకత్వంలో క్రౌడ్‌ ఫండెడ్‌ సినిమాగా తెరకెక్కిన ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’ ట్రైలర్‌ని నాగ్‌ అశ్విన్‌ విడుదల చేశారు. అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.

సుధీర్‌ వర్మ రైటింగ్, మనోహర్‌  కెమెరావర్క్, కార్తీక్‌ ఎడిటింగ్, యశ్వంత్‌ నాగ్‌ మ్యూజిక్‌ మా సినిమాకి హైలైట్స్‌. ఈ నెలాఖరులో సినిమా విడుదల కానుంది’’ అన్నారు. ‘‘మా సినిమాకు క్రౌడ్‌ సపోర్ట్‌ ఉంది.. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల సపోర్ట్‌ కూడా ఉంటుందని నమ్ముతున్నా’’ అన్నారు శైలేష్‌ సన్నీ. ‘‘మా ట్రైలర్‌ చూస్తుంటే భావోద్వేగంగా ఉంది. ఈ సినిమాలోని పాయింట్‌ అందర్నీ ఆలోచింపజేస్తుంది. అశోక్‌గారు సినిమా చాలా బాగా తీశారు’’ అన్నారు జ్ఞానేశ్వరి. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: ప్రవీణ్‌ సాగి.

మరిన్ని వార్తలు