డ్రైవ్‌–ఇన్‌–సినిమా?

18 May, 2020 00:52 IST|Sakshi
నాగ్‌ అశ్విన్

థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గుతుందనే మాట వినిపిస్తూనే ఉంది. తాజాగా కరోనా వల్ల థియేటర్స్‌ ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. దాంతో కొన్ని సినిమాలు నేరుగా  ఓటీటీలో (అమెజాన్, నెట్‌ ఫ్లిక్స్‌ వంటివి) విడుదలకు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో థియేటర్స్‌ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పలువురి అభిప్రాయం. ఆడియన్స్‌ని ఎలా రప్పించాలి అని ఆలోచిస్తున్నారు దర్శక–నిర్మాతలు.

ఈ విషయమై ‘ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి’ చిత్రాల దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్వీటర్‌ లో తన అభిప్రాయాలను పంచుకుంటూ, నెటిజన్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ‘‘థియేటర్స్‌ లో కుడా మద్యం అనుమతి ఇస్తే ఎక్కువ మంది థియేటర్‌ కి వస్తారా?’’, ‘డ్రైవ్‌ ఇన్స్‌ లో  సినిమా  ఐడియా ఎలా ఉంటుంది. బయటే అందరూ కార్లు, బైక్లు పార్క్‌ చేసుకొని సినిమా చూడొచ్చు. పాత కాలం టూరింగ్‌ టాకీస్‌ లాగా?’’ అని ట్వీట్‌ చేశారు నాగ్‌ అశ్విన్‌. మద్యం అనుమతి అనే ఆలోచనకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఏది ఏమైనా లాక్‌ డౌన్‌ పూర్తయ్యాక ఎలా ఉంటుందో? ఆడియన్స్‌ ను థియేటర్‌ కి ఎలా రప్పించాలో అని కొత్త కొత్త ఆలోచనలతో ఉన్నారు ఫిల్మ్‌ మేకర్స్‌. 

మరిన్ని వార్తలు