థియేటర్‌లో బీరు, బ్రీజర్‌ ఓకేనా: నాగ్‌ అశ్విన్‌

16 May, 2020 17:47 IST|Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాల విడుదల ఆగిపోయింది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోవు.. ఒకవేళ తెరుచుకున్నా వెంటనే ప్రేక్షకులతో కళకళలాడతాయనుకోవడం భ్రమ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రేక్షకులు నెమ్మదిగా ఓటీటీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య పెంచడం కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ ఐడియా చెప్తున్నారు. అయితే ఇది మంచి ఆలోచన, కాదా చెప్పాలంటూ నెటిజన్లను కోరారు.(2 వేల కోట్ల రూపాయల బీరు వృధా!)

‘ఒకసారి నేను, సురేష్‌ బాబు గారు, రానా  థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి అని చర్చించుకున్నాం. విదేశాల్లో మాదిరిగానే మన దగ్గర కూడా థియేటర్లలో బీర్‌, వైన్‌, బ్రీజర్‌ అందించేందుకు లైసెన్స్‌ ఇస్తే ఎలా ఉంటుంది.. వ్యాపారం మెరుగుపడుతుందా అని చర్చించుకున్నాం. ఇంతకు నా ఆలోచన మంచిదా, చెడ్డదా చెప్పండి’ అంటూ నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు వెంటనే స్పందించారు. కొందరు దీనికి మద్దతు తెలపగా.. మరి కొందరు మాత్రం ఇలా చేస్తే.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ థియేటర్లకు దూరమవుతారు అని రీట్వీట్‌ చేశారు.(పేరు చెడగొట్టకూడదనుకున్నాను)

>
మరిన్ని వార్తలు