నాగ చైతన్యకు నా థ్యాంక్స్‌...

19 Nov, 2015 20:31 IST|Sakshi
నాగ చైతన్యకు నా థ్యాంక్స్‌...

హైదరాబాద్‌:  నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న శంకరాభరణం చిత్రంలోని  ఒక సాంగ్ మేకింగ్  వీడియోను టాలీవుడ్  యంగ్ హీరో నాగ చైతన్య లాంచ్ చేశాడట. ఈ విషయాన్ని  కోన వెంకట్ , హీరో నిఖిల్  స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.  'శంకరాభరణం సినిమాలోని సాంగ్ మేకింగ్ వీడియో నాగ చైతన్య లాంచ్ చేశారు, చైతన్య కు నా థ్యాంక్స్' అంటూ ఈ చిత్ర సమర్పకుడు కోన  వెంకట్  ట్వీట్ చేశారు.

నిఖిల్‌, నందిత, అంజలి ప్రధాన పాత్రలుగా ఉదయ్‌ నందనవనం దర్శకత్వంలో రూపొందించిన  చిత్రం 'శంకరాభరణం'.  ఇప్పటికే  ఈ చిత్ర ఆడియో రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే.   కథలోని హీరో ఎన్‌ఆర్ఐ. తనకు సంబంధించిన భూమిని విడిపించుకోవాలనే ఉద్దేశంతో అతడు సొంత ఊరికి వస్తాడు. అక్కడ హీరోకు అనేక ఆటంకాలు , కుట్రలు ఎదురౌతాయి. అయితే  వాటినన్నింటినీ ఛేదించి తన భూమిని  ఎలా విడిపించుకున్నడన్నదే కథ.

 క్రైమ్‌, కామెడీ నేపథ్యంలో  రూపుదిద్దుకున్న ఈ మూవీ  షూటింగ్ ఎక్కువగా భాగం బిహర్ లో  జరిగింది.   2010లో విడుదలైన  'ఫస్ గయ రే ఒబామా' అనే హిందీ సినిమాకు మూలమనీ, దీనికి సంబంధించిన సౌత్ రైట్స్ మొత్తం తాము తీసుకున్నట్టు కో న వెంకట్ తెలిపారు.

నోబెల్‌ ఆండ్రే ప్రొడక్షన్స్‌ సహకారంతో కేరళలో మొత్తం 30 సెంటర్లలో శంకరాభరణం విడుదల చేయనున్నట్లు కోన వెంకట్ తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత.  సుమన్‌, సితార, రావు రమేష్‌, సప్తగిరి, సత్యం రాజేష్‌ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.  కోన వెంకట్..  కథ-స్క్రీన్‌ప్లే-మాటలు కూడా అందించిన  ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించారు.  
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా