నిహారిక... డాటరాఫ్‌ నాగబాబు

18 Jan, 2017 00:04 IST|Sakshi
నిహారిక... డాటరాఫ్‌ నాగబాబు

మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికకి నాన్నంటే విపరీతమైన ప్రేమ. తండ్రిని ఎవరైనా ఓ మాట అంటే అస్సలు భరించలేరట! రియల్‌ లైఫ్‌లో ఈ తండ్రీకూతుళ్ల గురించి బాగా తెలిసినవాళ్లు ఇలా అంటుంటారు. రేపు ‘నాన్న కూచి’ చూసిన తర్వాత ప్రేక్షకులకి కూడా తెలుస్తుం దంటున్నారు నిహారిక. రీల్‌ లైఫ్‌లోనూ నాగబాబు డాటర్‌గా నిహారిక నటిస్తున్న సినిమా ‘నాన్న కూచి’. నిహారిక ముఖ్యతారగా నటించిన ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ వెబ్‌ సిరీస్‌ తీసిన ప్రణీత్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

ఆల్రెడీ షూటింగ్‌ మొదలైంది. నిహారిక మాట్లాడుతూ – ‘‘నాన్నతో నటించడానికి భయపడలేదు. హీ ఈజ్‌ వెరీ కూల్‌. ఇంట్లో మేం ఎలా ఉంటామో.. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రల్లోనే నటిస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా... చాలామంది వెబ్‌ సిరీస్‌ అనుకున్నారు. కానీ, ఇది ఫీచర్‌ ఫిల్మ్‌’’ అన్నారు. అన్నట్టు... ఈ సినిమాకి నిర్మాత ఎవరో కాదు, నిహారికే. వెండితెరపై తొలి చిత్రం ‘ఒక మనసు’ తర్వాత ఆమె నటిస్తున్న రెండో సిన్మా ఇది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి