ప్లాన్‌ మారింది

27 Aug, 2019 00:09 IST|Sakshi
నాగచైతన్య, సాయి పల్లవి

ఆగస్ట్‌ చివరి వారంలో నాగచైతన్యను, సాయి పల్లవిని డ్యాన్స్‌ ఫ్లోర్‌ మీదకు తీసుకువెళ్లాలనుకున్నారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఇప్పుడు ప్లాన్‌లో చిన్న మార్పు. అనుకున్న ప్లాన్‌ను వారం రోజులు షిఫ్ట్‌ చేశారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఏషియన్‌ ఫిల్మ్స్‌ సునీల్‌ నారంగ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇది డ్యాన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్రేమకథ అని తెలిసింది. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి ఇద్దరూ తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడనున్నారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్ట్‌ 26న స్టార్ట్‌ కావాల్సింది. ఇప్పుడు సెప్టెంబర్‌ 5న హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుందట. డిసెంబర్‌కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు