మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ!

9 Sep, 2019 16:41 IST|Sakshi

హైబ్రిడ్‌ పిల్లగా.. భానుమతి పాత్రలో సాయి పల్లవి చేసిన అల్లరి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రను తాను మాత్రమే పోషించేలా నటించింది సాయి పల్లవి. ఆ పాత్రను అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ను ప్రారంభించారు.

నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలంగాణ కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. ఇదొక మ్యూజికల్‌ హిట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ మూవీలో సాయి పల్లవి పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని తెలిపారు. ఏఆర్‌ రెహ్మాన్‌ శిష్యుడు అయిన పవన్‌ ఈ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు