సక్సెస్‌ జోష్‌లో ‘మజిలీ’

7 Apr, 2019 18:36 IST|Sakshi

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ మూవీపై హైప్‌ ఏర్పడింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం అందర్నీ మెప్పించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు, సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్రబృందం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్‌, శివ నిర్వాణ, పోసాని మురళీకృష్ణ, రావు రమేష్‌లు పాల్గొన్నారు. ఈ మూవీ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 21కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీ మంచి వసూళ్లను సాధిస్తోంది.

మరిన్ని వార్తలు