కేటీఆర్‌పై నాగ చైతన్య కామెంట్‌!

11 Sep, 2018 19:03 IST|Sakshi

‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు నాగచైతన్య. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మారుతి స్టైల్‌ టేకింగ్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. 

ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అభిమానులతో ముచ్చటించేందుకు సోషల్‌మీడియాలో ఆన్‌లైన్లోకి వచ్చాడు ఈ యువ హీరో. అభిమానుల ప్రశ్నల తాకిడికి కూల్‌గా సమాధానమిచ్చాడు. ఈ సినిమాలో తనకు నచ్చిన పాటలు, రాబోయో తన ప్రాజెక్ట్‌ల గురించి,  అజిత్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ ఇలా హీరోలందరి గురించి తన అభిప్రాయాన్ని తెలపమని నాగచైతన్యను అడిగారు.

ఇక దీంట్లో భాగంగా కేటీఆర్‌ గురించి అడగ్గా.. ఆయనొక నిజమైన లీడర్‌.. ప్రభావితం చేయగల నాయకుడంటూ బదులిచ్చారు. ప్రభాస్‌ గురించి అడగ్గా.. లార్జర్‌ దెన్‌ లైఫ్‌ అని, రామ్‌ చరణ్‌పై స్పందిస్తూ.. సినిమా సినిమాకు బెటర్‌ అవుతూ ఉంటున్నాడు..అతని స్టైల్‌ ఇష్టమని సమాధానమిచ్చాడు. వెంకటేష్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మహేష్‌ బాబు, నాగార్జునలకు సంబంధించిన ప్రశ్నలు అభిమానులు అడిగారు. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది. 


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు