నాగ చైతన్య పెళ్లి డేట్‌ రివీల్‌

8 Jun, 2017 19:44 IST|Sakshi
నాగ చైతన్య పెళ్లి డేట్‌ రివీల్‌

హైదరాబాద్‌: ఎప్పటినుంచో  ఊరిస్తున్న  మోస్ట్ లవబుల్ పెయిర్ అక్కినేని నాగ చైతన్య- సమంతల  పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది.  జనవరిలో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట 2017 చివరిలో పెళ్ళి పీటలెక్కుతారని తరచూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఎపుడు అనే సస్పెన్స్‌ మాత్రం అభిమానులను వీడడంలేదు.  ఎట్టకేలకు   చైతు-సామ్స్‌పెళ్లి  తేదీ రివీల్‌ అయింది. తాజాగా సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ కి హాజ‌రైన చైతూ త‌న మ్యారేజ్ డేట్ అక్టోబ‌ర్ 6 అని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించినట్టు ఫిలింఫేర్‌ అవార్డ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. అక్టోబర్‌ 6 ఈజ్‌ బిగ్‌ డేట్‌ అని ట్వీట్‌ చేసింది.

జూన్‌17న  హైదరాబాద్‌ లో జరగనున్న 64వ జియో ఫిలింఫేర్‌ అవార్డ్స్‌(సౌత్‌)  నిర్వహించనున్న సందర్భంగా  జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు గెస్ట్‌ ఆఫ్ ఆనర్‌గా హాజరైన  చేతూ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం  ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్‌...అక్టోబర్‌ 6 అంటూ సిగ్గుల మొగ్గ అయిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  అంతేకాదు  మంచి రొమాంటిక్‌ ఫిలిం  లభిస్తే.. సమంతతో కలిసి పనిచేయడం తనకు సంతోషమేనని ప్రకటించారు. జితేష్‌ పిళ్లై, రిలయన్స్‌ జియో తెలంగాణా  సీఈవో కెసీ రెడ్డి తరుతరులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.