స్పెషల్‌ క్లాస్‌

6 Jul, 2019 00:15 IST|Sakshi
సాయిపల్లవి, నాగచైతన్య

స్కూల్లో, కాలేజీలో చదువుకునేటప్పుడు స్పెషల్‌ క్లాసులకి వెళుతుంటాం. ఇప్పుడు నాగచైతన్య కూడా వెళుతున్నారు. అయితే ఇది సినిమా స్పెషల్‌క్లాస్‌ అని ఊహించే ఉంటారు. ఈ క్లాస్‌ ఎందుకంటే.. తెలంగాణలో మాట్లాడటం కోసం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులోనే నాగచైతన్య తెలంగాణ భాష మాట్లాడబోతున్నారు. అమిగోస్‌ ఫిలింస్‌ సమర్పణలో ఏషియన్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణదాస్‌ నారంగ్, పి.రామ్మోహన్‌రావులు నిర్మాతలు.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబర్‌ నెలలో ప్రారంభం అవుతుందట. శేఖర్‌ కమ్ముల డైరెక్ట్‌ చేసిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ఫిదా’లో మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవితో తెలంగాణ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆమె మాట్లాడిన తీరు అందరికీ నచ్చింది. సాయి పల్లవి అంత పర్ఫెక్ట్‌గా మాట్లాడటానికి శేఖర్‌ కమ్ముల కొంతకాలం తర్ఫీదునిచ్చారాయన. ఇప్పుడు నాగచైతన్యకు సెపరేట్‌ క్లాసులు తీసుకొంటున్నారట. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భాస్కర్‌ కెమెరా: విజయ్‌కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు