కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయా

17 Sep, 2018 02:29 IST|Sakshi
నాగవంశీ, నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, మారుతి, నరేశ్‌

నాగచైతన్య

‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ ఇచ్చి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా కలెక్షన్స్‌ గురించి చెప్పినప్పుడు ముందు నమ్మలేకపోయా. ముఖ్యంగా మౌత్‌ టాక్‌ని చాలా పాజిటివ్‌గా స్ప్రెడ్‌ చేసిన వారికి, చేస్తున్నవారికి థ్యాంక్స్‌’’ అని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ, నరేశ్, పృథ్వీ ఇతర పాత్రల్లో నటించారు.

ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో నాగవంశీ. ఎస్, పీడీవీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మూడు రోజులకి దాదాపు 23 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా లుక్‌ చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా, బాడీ లాంగ్వేజ్‌ చాలా ఎనర్జిటిక్‌గా ఉందని అంటున్నారు. ఒక యాక్టర్‌కి ఇవే బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌. థ్యాంక్యూ మారుతిగారు.

అప్పుడు ‘ప్రేమమ్‌’, ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో హిట్స్‌ ఇచ్చిన నిర్మాతలకు  థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు సొంత అల్లుyì లా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వసూళ్లు మాకు చాలా ఆనందాన్ని, ఎనర్జీని ఇచ్చాయి. నా గత చిత్రాల కంటే ఈ చిత్రం బాగుందని ఫోన్లు చేస్తున్నారు’’ అన్నారు మారుతి. ‘‘ఈ సక్సెస్‌ మీట్‌కి కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్‌’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్‌.  నటులు నరేశ్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్‌ నిజార్‌ షఫి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు