పలాస చూశాక ధైర్యం వచ్చింది – నాగశౌర్య

4 Mar, 2020 08:40 IST|Sakshi
రక్షిత్‌ అట్లూరి, నాగశౌర్య, శ్రీవిష్ణు, నక్షత్ర

‘‘పలాస 1978’ లాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. అయితే ఈ సినిమా చూశాక చాలా ధైర్యం వచ్చింది’’ అన్నారు  హీరో నాగశౌర్య. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా 40 ఏళ్ల సినీ కెరీర్‌లో ‘పలాస 1978’ మంచి సినిమా అని నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా పోస్టర్‌పై నా పేరు ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు.

‘‘తమిళంలో వెట్రిమారన్‌లాంటి దర్శకుల్ని చూసి స్ఫూర్తి పొందుతుంటాం.. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారని కరుణ్‌కుమార్‌ గుర్తు చేశాడు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘పలాస’ నా ఫస్ట్‌ సినిమాగా చేద్దామనుకోలేదు. నాకు చాన్స్‌ ఇచ్చిన ప్రసాద్‌గారికి, తమ్మారెడ్డి భరద్వాజగారికి రుణపడి ఉంటాను’’ అన్నారు కరుణ్‌కుమార్‌. నిర్మాతలు రాజ్‌ కుందుకూరి, ‘మధుర’ శ్రీధర్, సంగీత దర్శకులు రఘు కుంచె, కళ్యాణీ మాలిక్, పాటల రచయిత భాస్కర భట్ల, సిరాశ్రీ తదితరులు మాట్లాడారు.

మరిన్ని వార్తలు