బాలయ్యకు అసలు కౌంటర్‌ రేపే : నాగబాబు

9 Jan, 2019 21:05 IST|Sakshi

వివాదంపై వివరణ ఇచ్చిన మెగా బ్రదర్‌

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలకృష్ణకు అసలు సిసలు కౌంటర్‌ రేపు(గురువారం) ఇవ్వబోతున్నట్లు మెగా బ్రదర్‌ నాగబాబు తెలిపారు. గత కొన్ని రోజులుగా బాలయ్యపై ఫేస్‌బుక్‌ వేదికగా నాగబాబు చేసిన సెటైరిక్‌ పోస్ట్‌లు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తాజాగా బాలయ్యపై తాను ఇంతలా రియాక్ట్‌ అవ్వడానికి కారణాలు చెబుతూ నాగబాబు ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. తాను ఎప్పుడూ బాలకృష్ణను వ్యక్తిగతంగా విమర్శించలేదని, తన ఫేస్‌బుక్‌ పోస్టుల్లో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించలేదన్నారు. తమపై గతంలో బాలయ్య చేసిన కామెంట్లపై కూడా ఎప్పుడూ రియాక్ట్‌ కాలేదన్నారు. పవన్‌ కల్యాణ్‌పై బాలయ్య వ్యక్తిగతంగా విమర్శలు చేసినా అన్నయ్యగా తాను ఒక్క మాట అనవద్దా? అని ప్రశ్నించారు. బాలయ్య తెలవదు.. పెద్ద బాలయ్య తెలుసని ఒక్క మాటంటే ఇంత వివాదం చేస్తారా?  వ్యక్తిగతంగా విమర్శలు చేయాలంటే 100 చేస్తామని, కానీ అలా చేయడం పద్దతి కాదన్నారు.

తన పోస్ట్‌ల్లో ఎక్కడా బాలయ్య పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. గుమ్మడికాయల దొంగ ఎవరు? మీరేందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. బాలయ్య మెగాబ్రదర్స్‌పై ఐదు సార్లు నోరు జారి వ్యక్తిగతంగా విమర్శించిన తాము ఏమనలేదన్నారు. 2011లో చిరంజీవీపై బాలయ్య చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు. అప్పుడే ఇవ్వాలనుకున్నానని, కానీ తమ అన్నయ్య ఆపారన్నారు. తనకేం పబ్లిసిటీ పిచ్చిలేదని, వివాదాలతో పాపులారిటీ కావాలనుకోవడం లేదన్నారు. ఓ ఆర్టిస్ట్‌గా తనకు ఉండాల్సిన గుర్తింపు ఉందని, అంతకు మించి అవసరం లేదన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు