పవన్‌ కల్యాణ్‌ ఐటీ డిగ్రీ హోల్డర్‌ : నాగబాబు

21 Apr, 2019 12:54 IST|Sakshi

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణామాలపై నాగబాబు ఆవేదన చెందుతూ.. తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఎందుకూ పనికి రాని వారిగా క్రియేట్‌ చేస్తున్నారని.. తల్లిదండ్రులను, కమర్షియల్‌గా మారిన ఎడ్యుకేషనల్‌ సిస్టమ్‌పై ఫైర్‌ అయ్యారు. అయితే ఈ వీడియోలో నాగబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చిరంజీవి డిగ్రీ పూర్తి చేశారని, ఇద్దరు సిస్టర్స్‌లో ఒకరు ఎంబీబీఎస్‌, మరోకరు డిగ్రీ పూర్తి చేశారని, పవన్‌ కల్యాణ్‌ ఇంటర్‌ తరువాత ఐటీలో డిగ్రీ హోల్డర్‌ అంటూ చెప్పుకొచ్చాడు. ఏనాడు తమ తల్లిదండ్రులు చదువు విషయంలో ఒత్తిడి చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోలో పవన్‌ ఐటీ డిగ్రీ హోల్డర్‌ అని చెప్పిన విషయంపైనే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో ఒక్కో ప్రచార సభలో ఒక్కో విధంగా తన విద్యాభ్యాసం గురించి చెప్పిన వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నారు. అయితే గతంలో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్‌ కాలేజీలో రికమెండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని ఓ సభలో.. వేరే గత్యంతరం లేక ఎమ్‌ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పారు. ఇంకొక సభలో అయితే స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌​కు వెళ్లానని వివరించాడు.

తాజాగా నాగబాబు తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘ ఐ క్లియర్డ్‌ మై ఎల్‌ఎల్‌బీ.. మద్రాసు బార్‌ కౌన్సిల్‌లో రిజిష్టర్‌ చేయించాను. చిరంజీవి గారు డిగ్రీ పాస్‌ అయ్యారు. ఇద్దరు చెల్లెల్లో ఒక చెల్లి ఎంబీబీఎస్‌, మరో చెల్లి డిగ్రీ చదివింది. కల్యాణ్‌ బాబేమో అదర్‌ దెన్‌ హిజ్‌ ఇంటర్మీడియట్‌.. తను కొన్ని ఐటీ సబ్జెక్ట్స్‌ పూర్తి చేసి.. ఐటీ డిగ్రీ హోల్డర్‌ అతను’ అంటూ వీడియోలో తెలిపారు. అయితే పవన్‌ కల్యాణ్‌ ఐటీ డిగ్రీ హోల్డర్‌ అని నాగబాబు అనడంతో మళ్లీ చర్చ మొదలైంది.

చదవండి : ఇంతకీ పవన్‌ ఏం చదివాడబ్బా!?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు