నాగకన్య విన్యాసాలు

5 May, 2019 06:14 IST|Sakshi
రాయ్‌ లక్ష్మి

దాదాపు 40 ఏళ్ల క్రితం వచ్చిన కమల్‌హాసన్‌ చిత్రాల్లో ‘నీయా’ ఒకటి. ఈ రొమాంటిక్‌ హారర్‌ థ్రిల్లర్‌ అప్పట్లో మంచి హిట్‌. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ రూపొందింది. తెలుగు వెర్షన్‌ టైటిల్‌ ‘నాగకన్య’. జై హీరోగా, వరలక్ష్మీ శరత్‌ కుమార్, రాయ్‌ లక్ష్మి, కేథరిన్‌ థెరిస్సా ప్రధాన పాత్రలలో ఎల్‌. సురేష్‌ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం తెలుగు హక్కులను లైట్‌ హౌస్‌  సినీమ్యాజిక్‌ అధినేత కె.ఎస్‌. శంకర్‌ రావు దక్కించుకున్నారు. ఈ నెల 10న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కె.ఎస్‌.శంకర్‌ రావు మాట్లాడుతూ– ‘‘హారర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనిషి పాముగా మారే సన్నివేశాలు, పాము చేసే విన్యాసాలు హైలైట్‌గా ఉంటాయి. కథ డిమాండ్‌ మేరకు గ్రాఫిక్స్‌కి భారీగా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సమ్మర్‌లో పిల్లలు, పెద్దలకు మంచి ఎంటర్‌టైనర్‌ అవుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా