వయసుని గెలిచారు

31 Aug, 2019 00:03 IST|Sakshi
సమంత, నాగచైతన్య, నాగార్జున, అమల, అఖిల్‌

నాగార్జున తన 60వ పుట్టిన రోజును జరుపుకోవడానికి కుటుంబంతో సహా స్పెయిన్‌ వెళ్లారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా ఫ్యామిలీతో కలసి ఎంజాయ్‌ చేస్తున్నట్టు సమంత ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. కుటుంబమంతా కలసి దిగిన ఈ ఫొటోను సమంత షేర్‌ చేస్తూ ‘‘మామయ్యా.. అందరూ దేనికోసమైతే వెతుకుతుంటారో అది మీ దగ్గర ఉంది. ప్రతీదాంట్లో సంతోషాన్ని వెతికి మరీ ఆనందంగా ఉంటారు.. మీ చుట్టూ ఉండి నేను నేర్చుకున్నది అదే.  మీరు వయసుని జయించారు మామా’’ అన్నారు.

మరిన్ని వార్తలు