చాలా అందంగా.. మిస్టీరియస్‌గానూ ఉంది: నాగార్జున

21 Mar, 2017 19:16 IST|Sakshi


ఓంకార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రాజుగారిగది-2’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతుందనడానికి నాగార్జున షేర్ చేసిన ఫొటోలే ఉదాహరణ. ఈ మూవీలో నాగ్‌కు కాబోయే కోడలు, స్టార్ హీరోయిన్ సమంత ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్న వార్త రాగానే అక్కినేని ఫ్యామిలీ అభిమానులతో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా సంబరపడ్డారు. 'రాజుగారిగది2' షూటింగ్ స్పాట్‌లో దిగిన కొన్ని ఫొటోలను నాగార్జున తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
 
‘రాజుగారిగది’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘రాజుగారిగది-2’లో నటించడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు నాగార్జున ఓ ట్వీట్లో తెలిపారు. సుముద్రపు ఓడ్డున నిల్చుని దిగిన ఫొటోను షేర్‌చేస్తూ.. సుముద్రాన్ని చూస్తూ ఆస్వాదించేందుకు తాను ఎంతగానో ఇష్టపడతానని.. సముంద్రం ఎంతో అందంగా.. అంతుబట్టకుండా (సో బ్యూటిఫుల్ అండ్ మిస్టీరియస్) ఉందని మరో ట్వీట్లో కింగ్ నాగ్ రాసుకొచ్చారు. పి.వి.పి, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.