ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

22 Jul, 2019 18:29 IST|Sakshi

నాలుగు గోడల మధ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే బిగ్‌బాస్‌ షో తనకు నచ్చదని ఒకానొక సందర్భంలో కింగ్‌ నాగార్జున పేర్కొన్నారు. అయితే విధి అనేది ఒకటి ఉండనే ఉంటుంది కదా.. వద్దన్న పనినే అది మనతో చేయిస్తూ ఉంటుంది. తనకు ఏ కార్యక్రమమైతే నచ్చదని చెప్పాడో ఆ షోకే హోస్ట్‌గా వ్యవహరించే పరిస్థితి వచ్చింది. అయితే బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కు నాగ్‌హోస్ట్‌గా కన్ఫామ్‌ అని తెలియగానే నాగ్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. డబ్బు కోసమే హోస్టింగ్‌ చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

అయితే వీటన్నంటికి నాగ్‌.. బిగ్‌బాస్‌ కార్యక్రమం ప్రారంభమయ్యే ముందే క్లారిటీ ఇచ్చేశాడు. ‘చల్లటి గాలి, నీలాకాశం, చుట్టూ మంచుకొండలు ఇలా నేచర్‌ మధ్య బతకడం నాకు చాలా ఇష్టం. అసలు ఆ బిగ్‌బాస్‌ హౌస్‌లో వాళ్లు అన్ని రోజులు అన్ని కెమెరాల మధ్య ఎలా బతుకుతున్నారు? నన్ను బతకమంటే నావల్ల మాత్రం కాదు. అందుకే నాకు ఆ షో అంటే ఇష్టం ఉండదు. కానీ మనసు కోతి లాంటిది. ఆ షో మీ అందరికి ఎందుకు ఇష్టమో నాకు తెలుసుకోవాలని ఉంది. అందుకే ఈసారి రంగంలోకి నేను దిగుతున్నాను’ అంటూ తనపై వచ్చిన ట్రోలింగ్‌కు కౌంటర్‌ ఇస్తూ.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే నిన్నటి ఎపిసోడ్‌పై, హోస్టింగ్‌పై రివ్యూలు, కామెంట్లు సోషల్‌ మీడియాలో వచ్చేశాయి. ఎపిసోడ్‌ను నాగ్‌ ఆద్యంతం వినోదభరితంగా నడిపించాడని, తన అనుభవంతో మొదటి ఎపిసోడ్‌ను సక్సెస్‌ చేశాడని పాజిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇక వందరోజుల పాటు సోషల్‌ మీడియాలో మళ్లీ బిగ్‌బాస్‌ షో రచ్చ చేయనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ప్రామిస్‌.. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: శ్రీముఖి

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌