సావిత్రి ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?

18 Apr, 2018 13:09 IST|Sakshi

త్వరలో సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సావిత్రికి సంబంధించిన పలు పాత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిలో ఓ ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. వెలుగు నీడలు సినిమాలో సావిత్రి ఓ పిల్లాడిని ఎత్తుకున్న ఫొటో అది.

అక్కినేని నాగార్జున అభిమాని గౌతమ్‌ ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోతొ పాటు ‘నాగార్జున గారు సావిత్రిగారితో మీరు కలిసి నటించారు’ అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన నాగ్‌.. గౌతమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలనాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పారు. 1986లో విక్రమ్‌ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయిన నాగ్‌, అంతుకు ముందే బాలనటుడిగా తెరమీద కనిపించారు.

మరిన్ని వార్తలు