ఆ ‘టచ్’ పిల్లలకు చెప్పాలి!

17 Nov, 2016 23:16 IST|Sakshi
ఆ ‘టచ్’ పిల్లలకు చెప్పాలి!

‘‘పిల్లలకు పెద్ద పెద్ద విషయాలు చెప్పకూడదు అనేది ఒకప్పటి మాట. సమాజంలో చెడు పెరిగిపోయింది కాబట్టి, కొన్నైనా పెద్ద విషయాలు చెప్పాలి’’ అంటున్నారు నమిత. చెన్నైలో ఓ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల్ని ప్రస్తావిస్తూ, ‘‘ఎదుగుతున్న ఆడపిల్లలకు తల్లితండ్రులు కొన్ని సలహాలూ, సూచనలూ ఇవ్వాలి. అవతలి వ్యక్తి ‘టచ్’ చేస్తే, ఆ టచ్ వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోగలిగేలా వాళ్లకు అవగాహన కలిగించాలి.

దురుద్దేశంతో ‘టచ్’ చేస్తే ఎలా ఎదుర్కో వాలో చెప్పాలి. పిల్లల దగ్గర ఇలాంటి విషయాలు ఎలా మాట్లా డాలని మొహమాటపడకూదు. ఎంత ఓపెన్‌గా మాట్లాడితే వాళ్ల జీవితం అంత బాగుంటుంది’’ అన్నారు.