అతడు నా అభిమాన హీరో

1 Jul, 2020 01:25 IST|Sakshi

మహేశ్‌లో నమ్రతకు నచ్చిన విషయం ఏంటి? మహేశ్‌ చేసే సినిమాల కథల్లో నమ్రత ఇన్‌వాల్వ్‌ అవుతారా? నమ్రత లైఫ్‌లో బెస్ట్‌ మూమెంట్స్‌ ఏంటి? వంటి పలు ప్రశ్నలను నెటిజన్లు నమ్రతను అడిగారు మంగళవారం నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్స్‌తో చిట్‌ చాట్‌ చేశారు. ఆ విశేషాలు ఈ విధంగా...

► లాక్‌డౌన్లో ఏం నేర్చుకున్నారు? 
సహనంగా ఉండటం నేర్చుకున్నాను. ప్రతి చోటా ప్రేమ ఉంటుందని తెలుసుకున్నాను. 
► షాపింగ్‌ అంటే ఇష్టమేనా? 
ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. 
► మరాఠీ ప్రజలను మిస్‌ అవుతున్నారా? 
 మహారాష్ట్రియన్‌గా గర్వపడుతున్నాను... నా మరాఠీ ఫ్యామిలీని మిస్‌ అవుతున్నాను. 
► మీరు మిస్‌ఇండియా కావడానికి స్ఫూర్తి?
మా అమ్మగారు 
► మీ జీవితంలో బెస్ట్‌ ఫేజ్‌? 
మదర్‌హుడ్‌ 
► మీ హాబీ? 
హోమ్‌ ఇంటీరియర్స్‌ను డిజైన్‌ చేయడాన్ని బాగా ఇష్టపడతాను. 
► మీరు తెలుగు బాగా మాట్లాడగలరా? 
మాట్లాడతాను కానీ ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. 
► ఫిట్‌నెస్‌ సీక్రెట్‌? 
వ్యాయామం చేయడం, తినడం, బాగా నిద్రపోవడం. 
► మీ లైఫ్‌లో బెస్ట్‌ మూమెంట్‌?
నా పెళ్లి రోజు. నేను ఇద్దరు పిల్లలకు తల్లినైన రోజు. 
► మీ ఫేవరెట్‌ టాలీవుడ్‌ హీరో? ఇంకెవరు?
మహేశ్‌బాబు. 
► మీ ఫేవరెట్‌ ప్లేస్‌? 
ప్రస్తుతం ఇంటిని మించిన ఫేవరెట్‌ ప్లేస్‌ లేదు. 
► మహేశ్‌గారిలో మీకు నచ్చిన విషయం? 
రియల్‌గా ఉండే మహేశ్‌ వ్యక్తిత్వం 
► మీ కూతురు సితార సినిమాల్లో నటిస్తుందా? 
ఈ విషయం గురించి ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం తను తన యూట్యూబ్‌ చానెల్‌ (ఆద్యా సితార) కోసం వీడియోలు చేయడంలో చాలా బిజీగా ఉంది. 
► మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో మరో సినిమా ఉంటుందా? 
ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పగలదు. 
►మహేశ్‌ నటించిన చిత్రాల్లో మీకు ఇష్టమైనవి? 
ఒక్కడు, పోకిరి, మహర్షి, దూకుడు, సరిలేరు నీకెవ్వరు, భరత్‌ అనే నేను 
► మహేశ్‌బాబుతో మీరు ఎప్పుడైనా ఇన్‌సెక్యూరిటీ ఫీల్‌ అయ్యారా? 
మా ఇద్దరికీ ఒకరికొకరిపై పూర్తి నమ్మకం ఉంది. సో.. ఇన్‌సెక్యూరిటీకి తావు లేదు. 
► మహేశ్‌బాబు వంట చేస్తానంటే మీరు ఏం వండమని చెబుతారు? 
మహేశ్‌ సులభంగా ఏం వండుతాడా? అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. 
► సితార, గౌతమ్‌.. ఎవరి అల్లరి ఎక్కువ? 
ఎవరి అల్లరి వాళ్లది 
► భవిష్యత్‌లో మహేశ్‌గారు, మీరు ఒకే సినిమాలో నటిస్తారా? 
ఈ జీవితకాలంలో అది మళ్లీ సాధ్యం కాకపోవచ్చని నాకనిపిస్తోంది. 
► మీ అత్తగారు ఇందిరమ్మ గురించి కొన్ని మాటలు చెప్పండి? 
ప్రేమకు నిర్వచనం. 
► మహేశ్‌ నిక్‌నేమ్‌?
నాని 
► మహేశ్‌ స్క్రిప్ట్‌ సెలక్షన్‌లో మీ పాత్ర ఉంటుందా? 
నేను ఇన్‌వాల్వ్‌ కాను. 
► మీరు సాయిబాబా భక్తురాలిగా ఎలా మారారు?
సాయిబాబాకు మా అమ్మగారు పెద్ద భక్తురాలు. నా అనుభవాలు నన్ను బాబా భక్తురాలిగా మార్చాయి. సాయిబాబా.. మై ఓన్లీ గురు.

భర్త, పిల్లల పేర్లతో టాటూ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా