సర్‌.. ఆరోజు పార్టీ చేసుకుందాం: నమ్రత

7 Jan, 2020 12:42 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు.. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టీం ఫుల్‌ జోష్‌లో ఉంది.  క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి మరింత బూస్ట్‌నిచ్చారు. ఈ సందర్భంగా మూవీ టీం ఒక్కచోట చేరి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేష్‌ బాబు సతీమణి నమ్రత సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

‘బ్లాక్‌బస్టర్‌ దిశగా అడుగులు వేస్తూ.. చరిత్ర సృష్టించబోతున్న సరిలేరు నీకెవ్వరు టీంతో  గత రాత్రి... అయితే మా డీవోపీ రత్నవేలును మిస్సవుతున్నాం. మరేం పర్లేదు సర్‌.. 11న ఇంతకంటే పెద్ద పార్టీ చేసుకుందాం’ అంటూ నమ్రత ఫొటోలను షేర్‌ చేశారు. ఇందులో మహేష్‌ కుటుంబంతో పాటు... డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, రామజోగయ్య శాస్త్రి, విజయశాంతి, తమన్నా, రష్మిక మందన్న, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌తో పాటుగా మహేష్‌కు.. మహర్షి వంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు.

కాగా ఈ సరిలేరు నీకెవ్వరులో ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నా సైతం పార్టీకి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేయడంతో.. అవి నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా.. జనవరి 11న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

#girlssquadgoals We are made of sugar , spice and everything nice, love you two my cuties #sitara #aadhya @namratashirodkar @urstrulymahesh @directorvamshi

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

సినిమా

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు