వెనక్కి తగ్గిన నానా పటేకర్‌? ప్రెస్‌మీట్‌ రద్దు

8 Oct, 2018 14:21 IST|Sakshi
నానా పటేకర్‌ (ఫైల్‌ ఫోటో)

తనూశ్రీ ఆరోపణలకు సమాధానంపై నానా పటేకర్‌ వెనకడుగు

 ప్రెస్‌మీట్‌ రద్దు చేసుకున్న నానా పటేకర్ 

సాక్షి,ముంబై: తనూశ్రీ దత్తా - నానా పటేకర్‌ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  నటి తనూశ్రీ చేసిన లైంగిక ఆరోపణలపై సమాధానం  చెపుతానని చెప్పిన నానా పటేకర్‌  వెనక్కి  తగ్గినట్టు కనిపిస్తోంది.  తనూశ్రీ ఆరోపణలను తోసిన పుచ్చిన నానా పటేకర్‌ అక్టోబర్‌ 8న నిర్వహించ తలపెట్టిన మీడియా సమావేశాన్ని రద్దు చేయడం  చర్చనీయాంశమైంది.  అనూహ్యంగా నేటి ప్రెస్‌మీట్‌ రద్దు చేసినట్టుగా నానా పటేకర్‌ కుమారుడు మల్హర్  మీడియాకు సమాచారం అందించారు. దీనిపై  తదుపరి సమాచారాన్ని తెలియచేస్తామని తెలిపారు.

 విలక్షణ నటుడుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు నానా పటేకర్‌పై  వచ్చిన లైంగిక ఆరోపణలు  కలకలం  రేపాయి. అయితే తనూశ్రీ దత్తా ఆరోపణలపై  సమాధానం ఇవ్వకుండా అవన్నీ అబద్ధాలు.. పదేళ్ల క్రితమే దీనికి సమాధానం చెప్పాను కదా అంటూ దాటవేస్తూ వచ్చారునానా పటేకర్‌. చాలాసార్లు మీడియా ప్రతినిధుల ప్రశ్నల్ని లెక్కచేయకుండా  మైకులను పక్కకి తోసుకుంటూ వెళ్లిపోయారు. అయితే అక్టోబర్‌ 8న  ప్రెస్‌మీట్‌  ద్వారా ఈ ఆరోపణలకు సమాధానం చెబుతానని  ప్రకటించారు. దీంతో​ నానా సమాధానంపై పలువర్గాల్లో తీవ్ర  ఆసక్తి నెలకింది. అయితే అనూహ్యంగా ఈ మీట్‌ను రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో నానా మీడియాకు ముఖం చాటేయడం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.  కాగా పదేళ్ల క్రితం 2008లో హార్న్‌ ఒకే ప్లీజ్‌ సినిమా సెట్‌లో నానా పటేకర్‌ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు గురి చేశాడని తనుశ్రీ దత్తా ఆరోపించడం కలకలం  రేపింది.  ఈ నేపథ్యంలో మీటూ ఇండియా ఉద్యమం రాజుకుంటున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా