నానా పోయి రానా వచ్చె

2 Nov, 2018 02:08 IST|Sakshi
రానా

బాలీవుడ్‌ కామెడీ మూవీ సిరీస్‌ ‘హౌస్‌ఫుల్‌’ టీమ్‌లోకి రానా జాయిన్‌ అయ్యారు. నానా పటేకర్‌ స్థానాన్ని ఈ హీరో భర్తీ చేశారు. నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన వల్ల చిత్రబృందానికి ఇబ్బంది కలగకూడదని నానా ‘హౌస్‌ఫుల్‌4 ’ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత నానా పటేకర్‌ స్థానంలోకి రానా వచ్చారు. మొదట ఈ పాత్రను అనిల్‌కపూర్‌ చేస్తారని వార్తలు వినిపించినా ఫైనల్‌గా రానా వచ్చారు.

ఈ పాత్ర గురించి రానా మాట్లాడుతూ – ‘‘హౌస్‌ఫుల్‌’ లాంటి కామెడీ జానర్‌ సినిమాలో ఇప్పటి వరకూ నేను నటించలేదు. కొత్త కొత్త జానర్స్‌లో కనిపించడం నాకెప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. హైదరాబాద్‌ బయటకు వచ్చి పని చేయడం కొత్తగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని భావిస్తాను. అక్షయ్‌ కుమార్‌తో ఆల్రెడీ పని చేశాను. ఇప్పుడు ‘హౌస్‌ఫుల్‌ 4’లో అనుభవం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి’’ అని పేర్కొన్నారు. కేవలం నానా పటేకర్‌ మాత్రమే కాదు దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ ప్లేస్‌లో ఫాహద్, సంజీ ద్వయం దర్శకులుగా వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ  

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ  

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు