బాలయ్య లుక్‌ మామూలుగా లేదుగా..!

7 Oct, 2019 17:03 IST|Sakshi

ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ లాంగ్‌ గ్యాప్‌ తరువాత కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్యకు సంబంధించిన కొన్ని లుక్స్‌ సోషల్‌ మీడియలో చాలా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా నందమూరి అభిమానులకి దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

చేతిలో రక్తపు కత్తి, ఒంటినిండా పసుపుకుంకుమతో యాంగ్రీ లుక్‌లో బాలయ్య కనిపిస్తుండటంతో మరోసారి బాక్సాఫీస్‌ దుమ్మురేపడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు. తొలుత సినిమాకు సంబంధించి బాలయ్య లుక్‌ చూసి అందరూ క్లాస్‌ సినిమా అనుకున్నారు.. కానీ తాజా లుక్‌తో మాస్‌ అభిమానులు మరోసారి పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య లుక్‌ బాలయ్య లుక్‌ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్‌ చౌహన్‌ కథానాయికగా నటిస్తోంది. భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది. కమర్షియల్‌ దర్శకుడిగా పేరున్న కేయస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో బాలకృష్ణ సక్సెస్‌ట్రాక్‌లోకి వస్తాడని భావిస్తున్నారు. కాగా ఈ సినిమా తెరకెక్కిస్తూనే బాలకృష్ణ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం. బోయపాటి శ్రీనివాస్‌ సినిమాకు ఇప్పటికే ఓకే చెప్పిన ఈ నందమూరి హీరో.. పూరి​ జగన్నాథ్‌తో కథా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఇద్దరి లోకం ఒకటే’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

బిగ్‌బాస్‌: పార్కింగ్‌ చేయకుంటే నామినేట్‌..

బాక్సాఫీస్‌పై వార్‌ దండయాత్ర..

పునర్నవి ఔట్‌.. స్టెప్పులేసిన హిమజ

కలైజ్ఞానం నివాసానికి రజనీకాంత్‌

విడాకులపై స్పందించిన ప్రముఖ నటి

మగాళ్ల గుప్పిట్లోనే సినిమా ఉంది..

హృతిక్‌రోషన్‌ వీర్యదానం చేయాలి : క్రీడాకారిణి

ఆత్మవిశ్వాసమే ఆయుధం

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?

ఎక్స్‌ప్రెస్‌ వేగం

ఐఎఫ్‌ఎఫ్‌ఐకు ఎఫ్‌2

పునర్నవి ఎలిమినేషన్‌.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్‌

బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలిసింది!

ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్‌ పోస్ట్‌

‘ఎఫ్‌2’కు అరుదైన గౌరవం

వార్‌ వసూళ్ల సునామీ

నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!

క్షమించండి.. తప్పైపోయింది ;బిగ్‌బాస్‌ విజేత

కాస్టింగ్‌ కౌచ్‌తో భయపడ్డాను..!

కీర్తి కొలువు

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి

ఫుల్‌ చార్జ్‌తో తిరిగొస్తా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలయ్య లుక్‌ మామూలుగా లేదుగా..!

‘ఇద్దరి లోకం ఒకటే’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

బిగ్‌బాస్‌: పార్కింగ్‌ చేయకుంటే నామినేట్‌..

బాక్సాఫీస్‌పై వార్‌ దండయాత్ర..

పునర్నవి ఔట్‌.. స్టెప్పులేసిన హిమజ

కలైజ్ఞానం నివాసానికి రజనీకాంత్‌